ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ లో పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. జిల్లా కలెక్టరేట్ ముందు న్యాయ వాదుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత కొద్దిరోజులుగా ఆందోలనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు కలెక్టరేట్ వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాలకు వస్తున్న వారిని న్యాయవాదులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.ఈ నేపధ్యంలో జరిగిన తోపులాటలో పలువురు న్యాయవాదులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడ్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో కలెక్టరేట్ ముందు భారీగా పోలీసులు మొహరించారు.
