విదేశాలకే పరిమితమైన రేవ్ పార్టీ కల్చర్ తెలుగు రాష్ట్రాలకు పాకేసింది. తాజాగా ఏపీలోని కర్నూలు నగరంలోని కొందరు వ్యాపారులు పార్టీల పేరుతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. కర్నూలులో ఏకంగా ఓ లాడ్జీలో దుకాణం పెట్టేయడం కలకలరేపింది. రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో టూ టౌన్ పోలీసులు, షీ టీమ్స్ … లాడ్జీపై దాడులు చేశారు.
అయితే ఒక ఎరువుల కంపెనీ తమ డీలర్లకు విందును ఏర్పాటు చేసి ముగ్గురు యువతులతో ఆశ్లీల నృత్యాలు చేయించినట్లు తెలుస్తుంది. ఈ రేవ్ పార్టీలో గతంలో నగరంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో పని చేసిన సీఐ, ఇద్దరు వ్యవసాయాధికారులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న షీ టీమ్ పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. అయితే సదరు సీఐతో సహా అధికారులు తప్పించుకొని పారిపోయారు. ఇందులో నృత్యాలు చేయడానికి హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన పార్టీ రాత్రి 11 గంటల వరకు జరిగింది. రాత్రి 9 గంటల నుంచి యువతులు ఆశ్లీలంతో నృత్యాలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దాదాపు 25 మంది ఉన్న పార్టీలో అందరూ తాగి ఊగుతూ ఆశ్లీలంగా యువతులతో కలసి నృత్యాలు చేసినట్లు సమచారం. సీసీ ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్నాపోలీసులు ప్రసాదరెడ్డి, పాండు, భానుచందర్‌రెడ్డి, ఎస్‌కే షంషద్ బేగం, మహేందర్‌రెడ్డి, ఎరువుల కంపెనీ మేనేజర్లు సురేష్, సుబ్బారావు, పవన్ కల్యాణ్‌రెడ్డి, కొమ్ము వెంకటేశ్వర్లు, ముగ్గురు యువతులను అరెస్టు చేశారు.
