తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని మెట్రోరైలుపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బేగంపేటలోని మెట్రో రైలు భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు.మెట్రో టికెటింగ్ లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని..ఆర్టీసీతోపాటు ఇతర అంశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.
మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీతో పాటు వాటి వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి మంత్రి సూచించారు.మెట్రో కారిడార్లో పార్కింగ్, ఫుట్ పాత్, రోడ్ల వంటి మౌళిక వసతుల కల్పన మరింత వేగంగా జరగాలన్నారు.మెట్రో స్టేషన్లతోపాటు, ఆయా కారిడార్లతో మూత్రశాలలు అవసరం ఉందని, వాటి నిర్మాణం కోసం పనులు వేగంగా జరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు .
మహిళల కోసం ప్రత్యేకంగా షి టాయిలెట్ల నిర్మాణం చేయాలని మంత్రి ఆదేశించారు.మెట్రోలో మిగిలిన కారిడార్ల నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి కేటీఆర్ సూచించారు . మెట్రో రెండో దశ ప్రణాళికలపైన ఈ సందర్భంగా మంత్రి చర్చించారు. కారిడార్ల ఎంపిక, స్టేషన్ల గుర్తింపు, నిధుల సేకరణ వంటి అంశాలపైన ఒక నివేదిక సిద్ధం చేయాలని, త్వరలోనే ముఖ్యమంత్రి ఈ అంశంపైన సమీక్షించే అవకాశం ఉన్నదని అధికారులకు తెలిపారుఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తోపాటు, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర అధికారులున్నారు.
As part of our endeavour to improve public transportation, asked @arvindkumar_ias & @hmrgov MD to expedite all corridors of Metro phase-1. Directed to improve speed & frequency of operations
Also asked them to submit DPRs of airport express connection & phase-2 at the earliest pic.twitter.com/UFXLEmzcwm
— KTR (@KTRTRS) February 20, 2018