ఇటీవల కాలంలో దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన హీరోయిన్ల కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు హీరోయిన్ల బొడ్డుపై పండ్లు, పూలు ఎందుకు వేస్తారో..? ఇప్పటికీ నాకు అర్థం కాదు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది తాప్పీ. ఇటువంటి వ్యాఖ్యలు చేయడంలో తాప్సీ కంటే ఇలియానదే మొదటి ప్లేస్. ఎప్పుడైతే ఇలియానాకు బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయో.. అప్పట్నుంచే బాలీవుడ్‌పై కామెంట్లు చేయడం మొదలు పెట్టింది ఇల్లీబ్యూటీ.
అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ.. 18 సంత్సరాలకే తనకు సినిమాలో ఆఫర్లు రావడం మొదలయ్యాయిన, తాను సినీ రంగంలోకి అలా ఎంట్రీ ఇవ్వగానే.. అందరూ నా నటనను చూడకుండా.. నా నడుముపై ఫోకస్ పెట్టారన్నారు. అందులో భాగంగానే తన మొదటి చిత్రంలో తన నడుముపై శంఖం బొమ్మను వేసి మరీ షూట్ వేశారని, నడుముపై శంఖం బొమ్మ ఎందుకని అడిగితే, మీ నడుము చాలా అందంగా ఉంటుంది.. అందుకే శంఖం వేస్తున్నామంటూ కామకళ్లతో చెప్పేవారని ఇంటర్వ్యూలో వెల్లడించింది గోవా బ్యూటీ. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ హీరో అజయ్‌దేవ్‌గన్‌తో రైడ్ అనే సినిమాలో నటిస్తోంది.