ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు.ప్రస్తుతం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ సర్కారు మీద టీడీపీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తాను అని జగన్ అనడం హస్యపదంగా ఉందని అన్నారు.జగన్ ఎప్పటికి అవినీతి పరుడే కానీ తమకు మిత్రపక్షం కాదు అని ఆయన నిప్పులు చెరిగారు ..
