జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు జేఎఫ్సీ అంటే ప్రజలు నమ్మరన్నారు. గతంలో హోదా కోసం దీక్ష చేస్తానన్న పవన్ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా పోరాడితేనే హోదా సాధించగలుగుతామని రోజా అన్నారు. పవన్ సూచన మేరకు అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ఎంపీల మద్దతు కూడగట్టేందుకు పవన్ సహకరిస్తారా? ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.
see also : మాస్టర్ ప్లాన్‌తో టీడీపీకి.. ఊపిరాడనివ్వకుండా జూలు విదిల్చిన జగన్..!
ఏప్రిల్ 6 లోపల ప్రత్యేక హోదా ప్రకటించని పక్షంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ఇప్పటికే తమ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. అంతేగాక టీడీపీ నాయకులకు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీలే ముఖ్యమని, కేంద్రంతో పోరాడే శక్తి లేక ప్రతి దానికీ రాజీపడిపోతున్నారని రోజా అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి 16 రోజులవుతుంటే కలుగులో దాగున్న సీఎం అన్ని పార్టీలు పొగబెట్టిన తర్వాత బయటకొచ్చి రాజీలేని పోరాటం చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఇప్పటివరకు ఆయన కాని, ఆయన పార్టీ ఎంపీలు, మంత్రులు ఎన్డీఏ నుంచి వైదొలుగుతామని ఎందుకు చెప్పలేకపోతోందని నిలదీశారు.