ఎల్లో బ్యాచ్‌కు మరో దిమ్మతిరిగే షాక్..!! అదేంటీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. అదేంటి అధికారంలో ఉన్న టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోవడమేంటని అనుకుంటున్నారా..? అవును మీరు చదివింది నిజమే. మీరు చదివినట్టే ఏపీలో టీడీపీ గ్రాఫ్ నాలుగో స్థానానికి పడిపోయింది. దీనికి కారణం కూడా లేకపోలేదు మరి. ఇటీవల జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. అలాగే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి పాలన, కేంద్రం వద్ద ప్రత్యేక హోదా తాకట్టు వంటి అంశాలను పరిశీలిస్తే మీరూ కూడా అవుననే అంటారు.
see also : జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం..!
see also : సినీ గాయని కౌసల్య..శోభనం రోజు రాత్రి భర్త ఇంత దారుణం చేశాడ..!
ఒకసారి పై కారణాలను విశ్లేషిస్తే.. చలికాలంలో కూడా వేడి కాచుకునేలా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, పార్లమెంట్ లోపల ఓ మాట, బయట ఓ మాట చెప్పిన టీడీపీ ఎంపీల తీరును ఏపీ ప్రజలు గమనించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ వెలుపల మాత్రం తాము ప్రత్యేక హోదా పై పోరాడుతున్నామంటూ చెప్పుకుంటూనే.. పార్లమెంట్ లోపల మాత్రం కేంద్ర మంత్రులు ఏపీ ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడినప్పుడల్లా చప్పట్లు కొట్టడం టీడీపీ ఎంపీల వంతైంది. మరో వైపు సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రులు బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగు బాగు అంటూ మీడియా ముందు చంకలుగుద్దారు కూడాను.
మరోవైపు వైసీపీ ఎంపీలు మాత్రం పార్లమెంట్ వెలుపలా.. లోపలా ఒకే తీరును ప్రదర్శిస్తూ ఏపీపై కేంద్ర మంత్రుల తీరును ఎండగడుగూ తమ నిరసనను వెలుబుచ్చారు. అంతేకాకుండా, ఏపీలోనూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తాను చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో మాట్లాడిన ప్రతీ సందర్భంలోనూ కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. ఆ పార్టీ తరుపున కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్‌లోపల ప్లకార్డు పట్టుకుని స్పీకర్ ఎదుట తన నిరసనను తెలిపిన విషయం తెలిసిందే. ఇలా ఏపీకి జరిగిన అన్యాయంపై ఎవరు పోరాడారన్న విషయంపై జరిగిన ఆన్‌లైన్ సర్వేలో వైసీపీ మొదటి స్థానంలో నిలవగా.. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, టీడీపీ రెండు, మూడు, నాలుగు స్థానాలు దక్కించుకుననాయి.