రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత ఇటివల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ఆమెకు ఘోర అవమానం ఎదురైంది.ఎంపీ గీత అనంతగిరి గ్రామంలో పర్యటించాలని నిర్ణయించుకొని తన అధికారక కార్యక్రమాల షెడ్యూల్ ను సంబంధిత అధికారులకు పంపించారు.
See Also:ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేషన్.. జగన్ కూడా ఊహించని విధంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం..?
అయితే తను దత్తత తీసుకున్న గ్రామమైన అనంతగిరి గ్రామానికి సమయం కంటే ముందు వచ్చారు.అయితే అధికారులు మాత్రం సమయానికి రాకుండా అసలు ఎంపీ చెప్పారు అని కాసింత గౌరవం లేకుండా సరిగ్గా రెండు గంటలకు అక్కడకు చేరుకున్నారు.దీంతో తీవ్ర అవమానానికి గురైన గీత రోడ్డు మీద బైటాయించారు .
SeeAlsoమాస్టర్ ప్లాన్‌తో టీడీపీకి.. ఊపిరాడనివ్వకుండా జూలు విదిల్చిన జగన్..!
అయితే ఇటివల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద అధికార టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే గీత మాత్రం ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఆపార్టీకి చెందిన నేతలపై గీత విరుచుకుపడ్డారు.అయితే తానూ టీడీపీలో ఉన్నాను అనే సంగతి కూడా మరిచిపోయి ఇలా విమర్శించడంతోనే స్థానిక టీడీపీ మంత్రి ,నేతలు ఇలా అధికారులను వ్యవహరించాలని ఆదేశాలను జారిచేశారు.అందుకే అధికారులు ఇలా చేశారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే కన్నతల్లి లాంటి వైసీపీని మోసం చేసి టీడీపీలో చేరిన ఆమె ఈ మాత్రం గుణపాఠం జరగాలని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు ..