ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కె రక్షణనిధి ఇంట విషాదం నెలకొన్నది.ఎమ్మెల్యే మాతృమూర్తి అయిన సూర్యకాంతం నిన్న ఆదివారం సాయంత్రం మృతి చెందారు.గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె రాష్ట్రంలో విజయవాడలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే నిన్న ఆదివారం ఆమె పరిస్థితి కొంచెం విషమం కావడంతో కన్నుమూశారు.సూర్యకాంతంకు ముగ్గురు కుమారులు ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.అయితే రక్షణనిధి పెద్దకొడుకు.ఈరోజు సోమవారం మధ్యాహ్నం వల్లూరిపాలెంలో సూర్యకాంతం మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి అని కుటుంబ సభ్యులు తెలిపారు.