తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కాటా అమ్రపాలి రెడ్డి , జమ్మూకు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మ ఒక్కటయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి-18) సాయంత్రం 6.30 గంటలకు జమ్మూలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వర్ధన్నపేట MPP మార్నేని రవీందర్ రావు హాజరై నూతన దంపతులను ఆశిర్వదించారు.కాగా ఈ నెల 21 వరకు కలెక్టర్ దంపతులు జమ్మూలోనే ఉంటారు. ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. 23న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు.