తెలంగాణ ఐటీ సిగలో మరో కలికితురాయి చేరనుంది. ప్రపంచ ఐటీ దిగ్గజం అడోబ్ తన సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా స్పందించింది. 2015 మే నెలలో శంతను నారాయన్ తో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తొలిసారి సమావేశమయ్యారు. ఆ తరువాత ఆయనను కలిసిన ప్రతిసారి హైదరాబాదులో అడోబ్ కార్యకలాపాలు విస్తరించాలని గుర్తుచేశారు. ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్ తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అడోబ్ కేంద్రాన్ని నెలకొల్పాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారు.మంత్రి కేటీఆర్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు శంతను నారాయణ్. అడోబ్ కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాదుకు ప్రత్యేక స్థానం ఇస్తున్నామని చెప్పారు.
మూడున్నర ఏండ్లుగా హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని అడోబ్ చైర్మన్ అన్నారు. నూతన టెక్నాలజీలపై ఇక్కడ సుశిక్షితులైన యువతరం లభ్యత ఉందని శంతను అభిప్రాయపడ్డారు. త్వరలోనే అడోబ్ కేంద్రానికి సంబంధించిన పెట్టుబడి, ఉద్యోగ అవకాశాలు, సంస్థ విస్తరణ వంటి వాటిపై సంస్థ ఒక ప్రకటన చేస్తామని మంత్రికి తెలిపారు.అడోబ్ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అడోబ్ సంస్థ ఏర్పాటుకు అవసరమైన సహయ సహకారాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు వినూత్న టెక్నాలజీలపై ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అడోబ్ కేంద్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంతో ఈకో సిస్టమ్ లో ఒక కొత్త ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Excited to announce Adobe is starting an advanced AI lab in Hyderabad. A global leader providing content creation & enterprise experience software solutions entering Hyderabad is great asset for the local ecosystem
Thanks a ton to Adobe Chairman & dear friend Shantanu Narayan ? pic.twitter.com/fLL9reh9zh
— KTR (@KTRTRS) February 19, 2018