కువైట్ క్షమాభిక్ష (ఆమ్నెస్టీ)కి అర్హులై ఇండియా రావాలని అనుకొని టికెట్ కు డబ్బులు లేని తెలంగాణ వారు ఎవరైనా ఉంటే తెలియజేయండి అని తెలంగాణ జాగృతి,ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు naveenachari@gmail.com కు మెయిల్ చేయాలని అయన సూచించారు . తెలంగాణ జాగృతి అధ్యక్షులు , నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదేశాలమేరకు వీరికి సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు . కువైట్ లో ఆమ్నెస్టీ ఈ నెల 22తో ముగియనున్న విషయం తెలిసిందే.