తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ట్విట్టర్‌లో కేటీఆర్.. ఓ చిన్నారి రాసిన లెటర్‌కి ఫిదా అయ్యారు. ‘‘డియర్ కేటీఆర్ అంకుల్. నేను సుప్రియని. 6 సంవత్సరాలు’’ అంటూ తను చదువుతున్న వివరాలతో పాటు తను ఉండే ఏరియాలోని సుచిత్రా జంక్షన్ వద్ద చిన్న పిల్లలు అడుక్కుంటున్నారు.. వారికి హెల్ప్ చేయమని కేటీఆర్‌ని వేడుకుంది సుప్రియ.అంతేకాకుండా అందుకోసం తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ. 2000ని ఇచ్చేస్తానని కూడా తెలిపింది. ఈ లెటర్‌ని ఆ పాప వాళ్ల నాన్న కేటీఆర్‌కి షేర్ చేశారు.
@KTRTRS
Dear Sir,am sending my daughter message..be cause your attention and proactive for solving public concerns gives us confidence.
thank you sir pic.twitter.com/HRcQklxnyy— Nageswara rao (@Nageswa20521680) February 18, 2018
ఈ లెటర్ చదివిన కేటీఆర్.. ఆ పాపపై ప్రశంసల వర్షం కురిపించారు.ఆ లెటర్ షేర్ చేసిన పాప వాళ్ల నాన్నకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. ‘‘ఆ పాపకి వచ్చిన ఆలోచన చాలా గొప్పదని, ఆ పాప చెప్పిన వారి పట్ల ఖచ్చితంగా కేర్ తీసుకుంటామని, ఆ చిట్టితల్లి కిడ్డీ బ్యాంకు సేవింగ్స్‌ని ఇస్తానని చెప్పడం చాలా నచ్చిందని’’ కేటీఆర్ తన ట్విట్టర్‌లో తెలిపారు.
Sir, please thank your little angel on my behalf for her thoughtful letter. I assure her that we will do our best to take care of the children she mentioned
Very sweet of her to offer her kiddie bank savings ?? https://t.co/KDFITlkWoh
— KTR (@KTRTRS) February 18, 2018