Home / TELANGANA / కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి..!

కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచి..!

గత కాలపు అనుభవాలు వర్తమానంలో జరిగే సంఘటనలే రేపటి చరిత్ర. తెలంగాణ చరిత్ర అంతా పోరాటాలే. నిన్నటి పోరాటాల పాఠాలే రేపటి బంగారు భవితకు, పునాదులు వేస్తున్నాయి. 1953 నుంచి అనేక ప్రత్యేక రాష్ట్రం కోసం ముల్కి ఉద్యమం,ఇడ్లి సాంబారు గో బ్యాక్..ఇలాంటి అనేక పోరాటాలు సాగాయి. కానీ టీఆర్‌ఎస్ వ్యవస్తాపకులు కల్వకుంట్ల చంద్రశేఖరావు గారి ఆద్వర్యంలో 2009లో ప్రారంభమైన మలిదశ ఉద్యమం ద్వారా తరతరాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాట అనుభవాలకు కేసీఆర్ సునిశిత దృష్టి తోడైంది.

కేసీఆర్ విజన్ దేశానికి ఒక దిక్సూచి. అత్యంత చిన్నదైన తెలంగాణ రాష్ట్రం దేశంలోని అనేక రాష్ర్టాలకు, కేంద్రానికి అనేక విషయాల్లో మార్గదర్శనం చేయడం, ఒక దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం తలెత్తుకొని నిలబడటం ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్లనే సాధ్యపడుతున్నది. ఇటీవలి దశాబ్దాల్లో ఇంత సమగ్రమైన దృక్పథం గల విజ న్ ఏ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కనపడదు. కేసీఆర్ విజన్ ప్రత్యేకతలు ఎన్నెన్నో. ఒక్క మాట లో చెప్పడం అసాధ్యం. పథకాలను పేర్కొంటేనే పేజీలకు పేజీల పుస్తకాలవుతాయి.

రూ.2 వందలున్న ఆసరా పథకం రూ.వెయ్యి కి పెంచడం, బీడీ కార్మికులకు ఆసరా పథకం, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు 75 వేల నుంచి రూ.లక్షకు పైగా పెంచడం, పేదల కు డబుల్‌బెడ్‌రూం పథకం, 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేసే నూతన పారిశ్రామిక విధానం, నెలరోజుల్లోనే భవన నిర్మాణానికి అనుమతి మంజూరుచేసే పారదర్శక విధానం కేసీఆర్ పథకాల కు ఉదాహరణలు. స్టార్టప్‌లతో నూతన ఒరవడి, ఐటీ ఎగుమతుల పెంపుదల కోసం ప్రత్యేక కృషి, ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ వాటా గా ఉన్న కరెంటును మూడేండ్లలో నాలుగు రెట్లు పెంచడం, 24 గం టలు విద్యుత్ మరికొన్ని. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను వేగంగా నిర్మించడం, వెంటదివెంట పొలాలకు నీరందించడం, దేశంలో ఏ రాష్ట్రం లో, కేంద్రంలో లేనివిధంగా 40 వేల కోట్ల బడ్జెట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల, విద్యార్థుల అభివృద్ధి కోసం కేటాయించడం, అడిగినదానికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యుత్ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచడం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, అంగన్‌వాడీ టీచర్లకు భారీగా వేతనాలు పెంచడం ఈ విధమైన ఎవరూ ఊహించని పథకాలెన్నో.. ప్రణాళికలెన్నో..

మిషన్ భగీరథతో ఇంటింటికి మంచినీరు అందించే పథకం వేగం పుంజుకోవడం, 31 జిల్లాలను ఏర్పర్చి పరిపాలనను ప్రజల వద్దకు తేవడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 560కి పైగా గురుకుల పాఠశాలలను, రెసిడెన్షియల్ కాలేజీలను ఏర్పాటుచేయడం, నీరసించిపోయిన ప్రభుత్వ దవాఖానలు పేషెంట్లతో కిటకిటలాడటం, ప్రసూతులకు కేసీఆర్ కిట్ అందజేయడం, ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానలు వెలవెలపోవడం, హాస్టళ్లకు రెసిడెన్షియల్ స్కూళ్లకు సన్నబియ్యం అం దజేయడం, రూపాయికి కిలో బియ్యం మనిషికి ఆరు కిలోలకు పెం చడం, కల్తీసారా అరికట్టి అకాల మరణాలను తగ్గించి వారికి నూతన ఉపాధి, శిక్షణ ఇవ్వడం, ఆర్థికసాయం అందజేయడం, విదేశాల్లో ఉన్నత విద్యకోసం వందలాది మందికి 20 లక్షల చొప్పున గ్రాంటు అందజేయడం, కులవృత్తుల్లో నైపుణ్యాలు పెంచి, గిట్టుబాటు పెంచడానికి ఇతోధిక బడ్జెట్లు కేటాయించడం, ప్రమాదవశాత్తు మరణించే కులవృత్తులవారికి ఐదు లక్షల బీమా, గొర్రెల పెంపకం, చేపల పెంప కం, చేనేత, పవర్‌లూం పరిశ్రమ, నాయీబ్రాహ్మణులకు ఆధునిక సెలూన్ శిక్షణలు ఇవ్వడం, వాషర్‌మెన్లకు నూతన యంత్రాలు మొదలుకొని ఎన్నో పథకాలను అమలుచేస్తున్నారు.

వ్యవసాయదారులకు ఎకరానికి 4 వేలు సబ్సిడీ ప్రకటించడం, సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం, భూముల రికార్డులను దశాబ్దాల తర్వాత కంప్యూటరీకరించి అప్‌డేట్‌చేసి పాస్‌పోర్ట్ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో పాస్‌బుక్‌లు అందజేసే విధాన రచన, నేరస్తుల జాబితాను, చిరునామాలను క్రోడీకరించి ఓ కన్నేసి ఉంచడం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో రాజకీయజోక్యం లేకుండా, పైరవీల ప్రమే యం లేకుండా వేలాదిమందిని పారదర్శకంగా నియమించడానికి సహకరించడం, తెలుగు వాచకాలను తెలంగాణ దృష్టికోణంతో కొత్త గా ముద్రించడం, ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ తెలుగు మహాసభలను ఉన్నతంగా నిర్వహించడం, తెలంగాణ చరిత్ర సం స్కృతి దృక్పథాలను తెలంగాణ దృష్టితో అధ్యయనం చేయడం, ఇసు క ద్వారా ఏటా వెయ్యి కోట్లు ఇతరులు కైంకర్యం చేస్తే దాన్ని క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయం పెంచడం లాం టి మొదలైన చర్యలు ప్రశంసనీయమైనవి.

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడం, నగరం చుట్టూ పర్యావరణం కోసం అడవులు పెంచాలని నిర్ణయాలు తీసుకోవడం, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, హైదరాబాద్ నీటి అవసరాలకు కొత్త ప్రణాళికలు రచించడం, కొత్త జిల్లాల్లో జిల్లా కార్యాలయాల సముదాయం, బ్రాహ్మణ పరిషత్, రెడ్డి హాస్టల్ వంటి వాటికి కులాలవారీగా నిధులు, స్థలాలు కేటాయించ డం.. ఇలా చెప్తూపోతే ఎన్నో ఉన్నాయి. 365కు పైగా పథకాలు, ప్రణాళికలున్నాయి. హరితహా రం ద్వారా కోట్లాది చెట్లు పెంచడం, దేశానికే ఒక స్ఫూర్తి. ఇలా ప్రతిరంగంలో చేస్తున్న కృషి ఆయా రాష్ర్టాలను, కేంద్రాన్ని, విదేశీయులను కూడా ఆకర్షిస్తూ తెలంగాణ నూతన అభివృద్ధికి నమూనాలకు ఒక దిక్సూచిగా నిలుస్తున్నది. ఇదంతా కేసీఆర్ విజన్ వల్లే సాధ్యమవుతున్నది.

కేసిఆర్ విజన్‌ను ఇతరులు పసికట్టడం, అనుసరించడం, విమర్శించడం అంత సులభం కాదు. అనుసరించడం సులభమే కానీ, విమర్శించడానికి దాన్ని అధ్యయనం చేయాల్సిన సమయం పడుతుంది. వారు అది అధ్యయనంచేసి విమర్శించేలోపే మరో రెండు కొత్త ప్రణాళికలు ముందుకువస్తుంటాయి. ఈ వేగం పరుగుపందెం లా ముందుకుసాగుతూనే ఉన్నది. దీన్ని అందుకోవడం ప్రతిపక్ష నాయకులకు సాధ్యం కావడంలేదు. అందువల్ల నిర్మాణాత్మక సూచ న చేయలేక చతికిలబడి చౌకబారు విమర్శలు చేస్తుంటారు. ఏ సమస్యను కూడా కేసీఆర్ పరిశీలించినంత లోతుగా, విస్తృతంగా పరిశీలించి విశ్లేషించేవారు రాజకీయాల్లోనేకాదు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా లేరు. నిష్ణాతులైన వారు కూడా ఇంతగా పరిశీలించడం కష్టమే. అనేకరంగాల శాస్త్రవేత్తలతో, ఇంజినీర్లతో, నిపుణులతో చర్చించి ఆయా రంగాలను భిన్నకోణాల్లో అధ్యయనంచేసి అడ్వాన్స్ చేయడంలో కేసీఆర్ విజన్ రూపొందుతున్నది. వేదాల్లో చెప్పినట్లు లెట్ కం నోబుల్ థాట్స్ ఫ్రం ఆల్ సైడ్స్ అన్ని వైపుల నుంచి ఆలోచనల ను ఆహ్వానించు, గమనించు, విశ్లేషించు, ఆచరణాత్మకంగా ఆలోచించు, అమలు జరుపు, ఫలితాలు రాబట్టు అనే విధానాన్ని చేపట్ట డం కేసిఆర్ విజన్‌లోని రహస్యం.

ఒక ప్రభుత్వ రంగానికి సంబంధించిన ప్రణాళికలపై చర్చలు చేయడానికి అధికారులు రెండు గంటలపాటు విషయాలను వివరించగలిగే సాధన సంపత్తి విశ్లేషణశక్తితో కేసీఆర్ దగ్గరికి వెళ్తే ఆయన అదే విషయంపై 4 గంటలు అనర్గళంగా వచ్చినవారికే చెప్పడం, విం టూ వారు ఆశ్చర్యపోవడం సాధారణమైపోయింది. అలా అందరిక న్నా ఎక్కువగా అధ్యయనం చేసి ఆయా విషయాలపై చర్చకు, ప్రణాళికల రూపకల్పనకు, అడ్వాన్స్‌మెంట్‌కు పూనుకోవడం కేసీఆర్ విశి ష్టత. ఇలా కేసీఆర్ విజన్ భారతదేశానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు, ప్రణాళికా సంఘాలకు, నీతి ఆయోగ్‌కు, భవిష్యత్ ప్రణాళికలకు ఒక దిక్సూచిలా నిలుస్తున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat