వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 92వ రోజుకు చేరుకుంది. కందుకూరు నుండి ప్రకాశంలోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ అదే జిల్లాలో వందరోజులు పూర్తి చేయనున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవల నెల్లూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో పారిశ్రామికవేత్త వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం.
see also : వైఎస్ జగన్ పాదయాత్రలో నవరత్నాలతో పాటు… కొత్త హామీలు.. ఇవే
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక పారిశ్రామిక వేత్త అయిన రఘురామకృష్ణం రాజు గతంలోనే వైసీపీలోకి వచ్చారు. అయితే ఆయన నరసాపురం ఎంపీ సీటును ఆశించగా.., అప్పటికే ఆ సీటు ఫిక్స్ అయిపోవడంతో ఆయన పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆయనకు బీజేపీ తరపున నరసాపురం సీటు వస్తుందని అందరూ భావించారు.
see also : తెలంగాణ టీడీపీకి మరో బిగ్ షాక్ ..!
అయితే బీజేపీలో కూడా రఘురామకృష్ణం రాజుకు సీటు దొరకలేదు. దీంతో ఆయన కామ్ అయిపోయారు. అయితే ఇటీవల ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారని.. ఈ నేపధ్యంలో ఆయన మళ్ళీ పాలిటిక్స్‌లోకి రీఎంట్రీ చేద్దామని అనుకుంటున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే వైసీపీ తరపున తన సీటు కోసం ఆ పార్టీ సీనియర్ నేతలతో లాబీయింగ్ చేస్తున్నారట. వచ్చే ఎన్నికలకు కేవలం సంవత్సరం మాత్రమే సమయం ఉంది ఈ సంవత్సరంలో వైసీపీ కేడర్‌ను అక్కడ మరింత బలోపేతం చేయడానికి రెడీ అనే సంకేతాలు కూడా వచ్చాయని సమాచారం. మరి రాఘురామకృష్ణం రాజు విషయంలో వైసీపీ అధినేత జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.