జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. పవన్ కళ్యాణ్.. రాజకీయంగా జగన్ పై చాలా కామెంట్లే చేశాడు. అయితే జగన్ మాత్రం పవన్ చేసిన విమర్శలను చాలా ఓపికగా భరించాడు గానీ వాటి పై స్పందించలేదు. అయితే తాజాగా ఏపీకి ప్రత్యేకహోదా కోసం చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రం పై అవిశ్వాసం పెట్టాలని వైసీపీని ఉద్దేశిస్తూ పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ సరైన సమయం దొరికిందని అనుకున్నాడేమో.. పవన్‌ను సింగిల్ ప్రశ్నతో ఇరకాటంలో పెట్టేశాడు.
ప్రకాశం జిల్లాలో పాదయాత్రలో భాగంగా మాట్లాడిన జగన్ ప్రత్యేక హోదా కోసం.. రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి కేంద్రం పై అవిశ్వాస తీర్మాణం పెట్టడానికి మేము సిద్ధం.. ఒకవేళ మీరు మీ మిత్రపక్షం టీడీపీ పెట్టినా మేమే మద్దతు ఇవ్వడానికి సిద్ద అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఏప్రిల్ 5వ తారీకున రాజీనామాలు చేస్తామని… మార్చి 5వ తారీకు నుండి పోరాటం మొదలై పార్లమెంట్ సమావేశాలు చివరి వారానికి వచ్చేసరికి అవిశ్వాసతీర్మం కూడా పెడతామని జగన్ అన్నారు. అంతే కాకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే..54 మంది మద్దతు కావాలి… అందుకు మీరు మీ మిత్రపక్షం రెడీనా.. అంటూ పవన్ పై డైరెక్ట్‌గా అటాక్ చేశాడు జగన్. అవిశ్వాసానికి తమ పార్టీ ఎంపీలు ఐదుగురు సిద్ధమని టీడీపీని పవన్ కళ్యాణ్ ఒప్పించాలని.. జగన్ చేసిన సవాల్ తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో జగన్ సవాల్ పై పవన్ కళ్యాణ్ కానీ టీడీపీకి కానీ తప్పక స్పందిచాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పందించకపోతే.. రాజకీయంగా పూర్తిగా మైనస్‌లో పడతారు. మరి జగన్ విసిరిన సవాల్ పై పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.