అటు కోలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లో నటి హేమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అంతలా తన నటనతో ప్రేక్షకులను సంపాదించుకుంది నటి హేమ. నటన విషయానికొస్తే ఆమెకు ఆమే సాటి. అక్క పాత్ర అయినా, తల్లిపాత్ర అయినా, వదిన పాత్ర అయినా, ట్రాజెడీ అయినా, కామెడీ అయినా హేమ నటన ఎందులోనూ తీసిపోలేనిది. అయితే, నటి హేమ 1989లో భలే దొంగలు చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
see also : జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం..!
see also : సినీ గాయని కౌసల్య..శోభనం రోజు రాత్రి భర్త ఇంత దారుణం చేశాడ..!
అయితే, ఇటీవల జరిగిన నటుడు శ్రీకాంత్ నటించిన రా..రా చిత్రం ఆడియో ఫంక్షన్‌లో నటి హేమ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో డైరెక్టర్ నన్ను చాలా తక్కువ అంచనా వేశాడని, కొన్ని సీన్లలో రోప్ కట్టుకోవాల్సి వస్తే.. హేమ ఈ సీన్లను చేయగలదా..? అన్న సందేహాన్ని వ్యక్తం చేశాడని చెప్పింది. అయితే, నేను ఏ మాత్రం భయపడకుండా రోప్ కట్టుకుని చేయాల్సిన సీన్లను చేయగలిగానని చెప్పింది. ఈ సందర్భంలోనే తన చిన్ననాటి విషయాలను చెప్పింది నటిహేమ. తన చిన్నతనంలో గోడలు దూకడం, గోదావరి నదిలో ఈత కొట్టడం తనకు అలవాటేనని, నేను సినీ ఇండస్ర్టీలోకి రాకుంటే.. గోదావరి నదిలో స్విమ్మింగ్ చేసి వరల్డ్ రికార్డ్ కొట్టేదాన్నేమోనంటూ చెప్పుకొచ్చింది నటి హేమ.