టీం ఇండియా మాజీ కెప్టెన్ ,స్టార్ ఆటగాడు ,వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ఇప్పటికే పలు రికార్డ్లను తన సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా ధోని మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్ లో హెన్ డ్రీక్స్ ఇచ్చిన క్యాచ్ ను అందుకున్న ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ లందుకున్న వికెట్ కీపర్ గా రికార్డును సొంతం చేసుకున్నాడు.
మొత్తంగా రెండు వందల డెబ్బై ఐదు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లలో ధోని ఇప్పటివరకు నూట ముప్పై నాలుగు క్యాచ్ లందుకున్నాడు.దీంతో ఈరోజు వరకు అగ్రస్థానంలో ఉన్న శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కర(133)ను ధోని దాటేశాడు.అయితే టెస్ట్ ,వన్డే ,ట్వంటీ ట్వంటీ అన్ని ఫార్మాట్లో కల్పి అత్యధికంగా క్యాచ్ లను పట్టుకున్న వికెట్ కీపర్ల స్థానంలో ధోని మూడోవాడు.మొత్తం ఆరువందల ఒకటి క్యాచ్ లతోపాటుగా నూట డెబ్బై నాలుగు స్టంపింగ్ లను ధోని చేశాడు..