ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మంచి హీట్ మీద ఉన్నాయి.ఒకవైపు గత నాలుగు ఏండ్లుగా తమ సర్కారు రాష్ట్రానికి అన్ని నిధులు కేటాయిస్తూనే మరోవైపు అన్ని రకాలుగా అండగా ఉంటున్నామని బీజేపీ నేతలు అంటుంటే ..లేదు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను తుంగలో తొక్కుతూ ..నాలుగు ఏండ్లుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని టీడీపీ నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు..
ఈ క్రమంలో రాష్ట్రంలో విజయవాడ లో జరిగిన బీజేపీ పార్టీ నేతల సమీక్షా సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారని కమలం నేతలు అంటున్నారు.అందులో భాగంగా టీడీపీ పార్టీ తమ నుండి విడిపోకముందే తామే మిత్రపక్షం నుండి వైదొలుగుతాం.రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న తమ నేతలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు ,ఎంపీ హరిబాబు అన్నారు.
అంతే కాకుండా మంత్రులుగా ఉన్న కామినేని శ్రీనివాస్ రావు,మాణిక్యాల రావు త్వరలోనే రాజీనామాలు చేసి ప్రతిపక్ష పార్టీగా గత నాలుగు ఏండ్లుగా ఏపీకి కేంద్రం ఏమి చేసిందో లెక్కలతో సహా ప్రజలకు వివరించాలని తీర్మానాలను చేశామని హరిబాబు అంటున్నారు.చూడాలి మరి ఈ రాజీనామా వార్తల్లో ఎంతవరకు నిజముందో కాలమే చెప్పాలి ..