ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే ఇటివల కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ ఆరో తారీఖున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ ప్రకటించడంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..
See Also:ఏపీ పాలిటిక్స్‌లో సెన్షేషన్.. జగన్ కూడా ఊహించని విధంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం..?
ఆయన మాట్లాడుతూ ఎంపీలు రాజీనామా కాకుండా అవిశ్వాస తీర్మానం పెడితే బాగుంటది అని తేల్చి చెప్పారు.దీనికి స్పందనగా జగన్ అలా మాట్లాడారు.తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం మీద స్పందించారు.
SeeAlso మాస్టర్ ప్లాన్‌తో టీడీపీకి.. ఊపిరాడనివ్వకుండా జూలు విదిల్చిన జగన్..!
ఆయన మీడియాతో మాట్లాడుతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఎటువంటి లాభం ఉండదు.అంతే కాకుండా రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది.అందుకే తీర్మానం వృధా అని బాబు తేల్చి చెప్పారు ..