ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు మృతి చెందారు.రాష్ట్రంలో ప్రకాశం జిల్లాకు చెందిన గిద్దలూరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే ,సీనియర్ నేత అయిన పగడాల రామయ్య గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.అందులో భాగంగా రామయ్య తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆయన ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు.రామయ్య రాచర్ల మండలంలో చిన్నగానిపల్లెలో జన్మించారు.రామయ్య మృతిపట్ల ఆ పార్టీ నేతలు ,కార్యకర్తలు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు .
