తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో తమ మిత్రపక్షాలైన బీజేపీ ,జనసేన పార్టీల సహకారంతో మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలను ,ఒక ఎంపీ స్థానాన్ని గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని సర్కారు అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.
see also : డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్
ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు ,ఒక ఎంపీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కారేక్కారు.తాజాగా టీటీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.తాజాగా రేవంత్ జాబితాలో మరో సీనియర్ నేత చేరబోతున్నారు.రాష్ట్రంలో గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఇంచార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు.
see also : ఆమ్రపాలి పెళ్ళికి హాజరైన ఎమ్మెల్యే అరూరి రమేష్
ఈ క్రమంలో నియోజక వర్గంలో ఉన్న ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు ,నేతలు,కార్యకర్తలతో సమావేశం కానున్నారు.ఈ భేటీ అనంతరం ప్రతాప్ రెడ్డి తన అనుచరవర్గంతో సహా కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని ప్రతాప్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు అని తెలుగు తమ్ముళ్ళ గుసగుసలు.కార్యకర్తలతో ,స్థానిక నేతలతో భేటీ జరిపిన తర్వాత ఉగాది పండుగ రోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ప్రతాప్ రెడ్డి..
see also : వైఎస్ జగన్ పాదయాత్రలో నవరత్నాలతో పాటు… కొత్త హామీలు.. ఇవే