Home / SLIDER / విద్యుత్‌శాఖలో భారీ నోటిఫికేషన్..!

విద్యుత్‌శాఖలో భారీ నోటిఫికేషన్..!

విద్యుత్‌శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదలయింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) పరిధిలోని 5 సర్కిళ్లలో మొత్తం 2553 జూనియర్ లైన్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 8న పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి మార్చి 19 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో www.tsnpdcl.in ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సంస్థ చైర్మన్, ఎండీ అన్నమనేని గోపాల్‌రావు శనివారం ఓ ప్రకటనలో సూచించారు. ఏప్రిల్ 2 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఏప్రిల్ 8న పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొన్నారు.

పోస్టుల వివరాలు

సర్కిల్            పోస్టులు

వరంగల్           575

కరీంనగర్          674

ఖమ్మం              365

నిజామాబాద్         500

అదిలాబాద్          439

…………………………………………

మొత్తం          2553

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat