సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా టాస్ ఓడిపోవడంతో బ్యాటింగ్ కు దిగింది.ఇప్పటికే వన్డే సిరిస్ 1-5తో టీం ఇండియా గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ముందు బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియాలోకి సీనియర్ ఆటగాడు సురేష్ రైనా చాలా రోజుల తర్వాత తిరిగొచ్చాడు.హార్దిక్ పాండ్యా కాకుండా ముగ్గురు రెగ్యులర్ పేసర్లతో భారత్ బరిలోకి దిగుతుంది.మోకాలి గాయంతో డివిలియర్స్ జట్టుకు దూరమయ్యాడు.జేపీ డుమిని కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
