ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న విమెన్స్ టీం ఇండియా సౌతాఫ్రికా జట్టుతో ట్వంటీ ట్వంటీ సిరిస్ ఆడుతున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో మొదటి రెండు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ల్లో విజయకేతనం ఎగురవేసిన టీంఇండియా మూడో మ్యాచ్ లో మాత్రం చతికిలబడింది.మూడో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా విమెన్స్ నిర్ణీత ఓవర్ల కంటే ముందుగానే ఆలౌట్ అయింది.
జట్టుకు చెందిన స్టార్ బ్యాట్స్ ఉమన్ స్మృతి మంధాన ముప్పై ఏడు పరుగులను ,కెప్టెన్ హర్మత్ ప్రీత్ కౌర్ నలబై ఎనిమిది పరుగులను సాధించడంతో కేవలం 17.5 ఓవర్లో 133 పరుగులకే ఆలౌట్ అయింది.ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఇస్మాయిల్ ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టి టీం ఇండియా పతనాన్ని శాసించింది.