జీఎస్టీ’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శనివారమంతా హైదరాబాద్ పోలీసుల సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యి గడిపిన వర్మ రాత్రి తన ట్విటర్ పేజిలో ఓ పోల్ నిర్వహించాడు. పవన్ కళ్యాణ్‌ను పోర్న్‌లానే ఇష్టపడతానన్నా వర్మ.. అభిమానులు మీరు పోర్న్ ఇష్టపడతారా లేక పవన్‌నా అని ప్రశ్నించాడు. అంతేగాకుండా పోర్న్‌పవన్ అనే హ్యాష్ ట్యాగ్ సృష్టించాడు. దీనిపై పవన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
తాను తీసిన జీఎస్టీ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడని సామాజిక కార్యకర్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వర్మను విచారించారు. అనంతరం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో వర్మ తన వ్యాఖ్యలపై మహిళలకు క్షమాపణలు తెలిపాడు. పోర్న్ కల్యాణ్ అని వర్మ చేసిన ట్వీట్‌కు కత్తి మహేశ్ తనదైన శైలిలో స్పందించాడు. పోర్న్ కల్యాణ్ శబ్ధం బాగుందని, అతను కచ్చితంగా ఆనందిస్తాడని ట్వీట్ చేశాడు.
ఇక తాజాగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో అద్బుతం చేస్తదని నేను గట్టిగా నమ్ముతున్నానని, నిజం ఎప్పుడు హర్ట్ చేస్తుందని మరో ట్వీట్ చేశాడు.