తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు ప్రజలు అటు పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఆకర్షితులవుతున్న సంగతి తెల్సిందే.ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న మిషన్ భగీరథ ,మిషన్ కాకతీయ ,హరితహారం లాంటి కార్యక్రమాలను పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాల్లో అమలుచేయడానికి ముందుకొస్తున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.అందులో భాగంగా రాష్ట్రంలో అమ్రాబాద్ మండలంలో ఉడిమిళ్ళ గ్రామానికి చెందిన గ్రామస్తులందరూ అచ్చంపేట అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు.ఈ క్రమంలో ఎమ్మెల్యే బలరాజ్ వారికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ..