ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. పత్తికొండలో శనివారం జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన కొద్దిసమయం స్థానిక నాయకులు ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మేలని టీడీపీ ఎందుకు అంటుందో తెలియడంలేదని ఆయన అన్నారు. ఇక జనసేన అధ్యక్షుడి వపన్‌కల్యాణ్‌ను ప్రస్తావిస్తూ గత ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ కూటమికి బహిరంగ మద్దతు ఇచ్చి రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించడం తన ఘనతేనని చెప్పుకుంటున్న ఆయన అప్పుడప్పుడూ మెరుపు తీగ మాదిరి మెరుస్తుంటాడన్నారు. ఆయన వల్ల ఏపీ ప్రజలకు ఏమైన న్యాయం జరిగిందా అని ఆయన అన్నారు. కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, పెండేకల్లు భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
