ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు.ఇటు రాష్ట్రవ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న క్రేజీ ఇంతా అంతా కాదు.నిన్న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.అంతేకాదు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఒక్క ఫేస్బుక్ లోనో ,వాట్సాప్ లోనో కాదు.. సోషల్ మీడియాలో ప్రధాన వేదికలైన ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ లలో దేశవ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషెస్ తో నిండిపోయింది. ట్విట్టర్ లో HappybirthdayKCR #ట్యాగ్ రోజంతా ట్రెండింగ్ గా ఉంది.
ఫేస్బుక్ లో చాలామంది పోస్ట్లు , ఫోటో ల ద్వారా కేసీఆర్ ని విష్ చేస్తే.. పండుగలకు పాటలు రూపొందించినట్టు యూట్యూబ్ లో వివిధ టీవీ ఛానళ్లు పోటీ పడి ప్రత్యేకంగా ఆయనకోసం పోటీ పడి వీడియో పాటలను రూపొందించాయి.ముఖ్యంగా ప్రముఖ టీవీ చానెల్ టీ న్యూస్,టీవీ వన్ , బందూక్ టీం 18 మంది టాలీవుడ్ సింగర్స్ తో గోరేటి వెంకన్న రాసిన పాటను చాలామంది తమ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మీద ఉన్న ప్రేమ.. ప్రజా నాయకుడిగా ఇంకా పెరిగింది.తెలంగాణ జాతివిముక్తి కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడమే కాకుండా, ఆశయసాధన కోసం ఎన్నో అత్యున్నతమైన పదవులను సైతం చీపురుపుల్లలా తీసిపారేసిన మహోన్నత వ్యక్తిత్వం కేసీఆర్ సొంతం..రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతూ వారి అభివృద్ధికి బాటలు వేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా సాగుతున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కేసీఆర్ అంటే తమ ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు.అందుకే కేసీఆర్ అంటే అందరికి ఇష్టం.