ఐటీ రంగంలో రాణించాలాంటే చదువుతో పాటు ప్రోగ్రామింగ్‌లో పట్టు ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక కోర్సులుంటాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలనుకునే వారు నేర్చుకోవచ్చు. అయితే ఆర్థికంగా స్థోమత లేనివారి కోసం పలు సంస్థలు కొన్ని యాప్స్‌ను తయారు చేశాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోని ఆండ్రాయిడ్ ఫోన్లలో నేర్చుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఆడుతూ పాడుతూ ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధించవచ్చు. అలాంటి అప్లికేషన్ల గురించి తెలుసుకోండి మరి.
ఉడా సిటీ-లైఫ్ లాంగ్ లెర్నింగ్
ఈ యాప్‌లో అందుబాటులో ఉన్న కోర్సులను ఫేస్‌బుక్, గూగుల్, క్లౌడ్ ఎరా, మోంగోడిబీ వంటి దిగ్గజ కంపెనీలకు చెందిన నిపుణులు డిజైన్ చేశారు. ప్రోగ్రామింగ్‌కు చెందిన బేసిక్స్‌తో పాటు మోస్ట్ అడ్వాన్స్‌డ్ కోర్సులను ఇక్కడ నేర్చుకునే వీలుంటుంది. టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్, పైతాన్, జావా ఇంకా ఇతర ప్రోగ్రామింగ్ భాషలకు సంబంధించి కోడింగ్‌ను నేర్చుకోవచ్చు…
ప్రోగ్రామింగ్ హబ్
ఈ అప్లికేషన్‌లో దాదాపు 1800 వరకు ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని 17 కంటే ఎక్కువ భాషల్లో నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ ఇంకా లెర్నింగ్ ఈ ప్రోగ్రామ్‌కు ఉపయోగించుకోవచ్చు. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్ వంటి ప్రోగ్రామ్‌లను ఇంటర్‌నెట్ కనెక్షన్ లేకున్నా నేర్చుకోవచ్చు.
లెర్న్ పైథాన్
బాగా డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్ లాంగ్వేజీల్లో ఇది ఒకటి. ఈ యాప్ ప్రోగ్రామింగ్‌ను సులువుగా నేర్పుతుంది. బేసిక్స్‌తో పాటు డేటా టైప్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్, ఫంక్షన్స్ అండ్ మాడ్యువల్స్, ఎక్సెప్షన్స్ ఇంకా ఫైల్స్ అందుబాటులో ఉంటాయి.
లెర్న్ ప్రోగ్రామింగ్
ఇది ప్రత్యేకంగా ఇంటరాక్టీవ్ టెక్ట్స్ బుక్ ఆఫ్ ఇంటర్నెట్ టెక్నాలజిస్ అనే థీసిస్‌కు సంబంధించినది. ఇందులో హెచ్‌టీఎంఎల్5కు సంబంధించి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. దీంతో పాటు మరో 30కి పైగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలను నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూ కోసం నమూనా ప్రశ్నలు ఇక్కడ ప్రిపేర్ అయ్యి ఉంటాయి. యాప్ సెట్టింగ్స్‌ను కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.
సీ ప్రోగ్రామింగ్
ఈ యాప్ ద్వారా సీ ప్రోగ్రామింగ్‌కు సంబంధించి నోట్స్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌ల్లో చేసుకోవచ్చు. ఇందులో 90కి పైగా సీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండే ఈ యాప్ ద్వారా కంటెంట్‌ను మరింత సులువుగా అర్థం చేసుకునే వీలుంటుంది. చాప్టర్ వైజ్ సీ ట్యుటోరియల్స్ ఇక్కడ లభ్యమవుతాయి. ఇదే సమయంలో ముఖ్యమైన ఎగ్జామ్ ప్రశ్నలను ఇక్కడ పొందవచ్చు.