ప్రేమికుల రోజు అనగానే అందరూ ఎన్నో ఊహల్తో తమ ప్రేమికుల కోసం ఆశ్చర్యపరిచే రీతిలో వాళ్ళ ప్రేమను తెలుపుతూ, సరదాగా కబుర్లతో వాళ్ళ మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ సంతోషంగా గడుపుతారు. అయితే మన తెలుగు వెండితెర అందాల పాలరాతి సుందరి తమన్నామాత్రం ఎవరూ ఊహించని వ్యక్తితో ప్రేమికులు రోజును గడిపింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఫిబ్రవరి 13 రాత్రి శివరాత్రి వేళ ఆమె ఆధ్యాత్మిక వేత్త జగ్గీవాసుదేవన్ సమక్షంలో దైవారాధనలో గడిపింది. మహాశివుడి భక్తి పారవశ్యంలో నిమగ్నమై శివారాధన చేసింది.మహాశివరాత్రి పర్వదినాన కోయంబత్తూరులో జగ్గీ వాసుదేవన్ ఆధ్వర్యంలో శివరాత్రి జాగారం రాత్రంతా ఆ స్వామిజీతో ఆ ఆధ్యాత్మిక వేడుకలో తమన్నా కూడా పాల్గొంది. సినిమాల్లో కురుచ బట్టల్లో అందాలు ఆరబోసే ఈ సుందరి ఆ రోజు మాత్రం ఆధ్యాత్మికతకు చిహ్నమైన కాషాయ రంగు దుస్తులు వేసుకుంది. జగ్గీవాసుదేవన్ తో ఫోటోలు కూడా దిగింది. తమన్నాయే కాదు ఇంకా చాలా మంది ప్రముఖులు ఆరోజు జగ్గీవాసుదేవన్ సమక్షంలో దైవాన్వేషణలో పునీతమయ్యారు.
