పాఠశాలలలో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కలిపించే ప్రభుత్వ విధానామే మధ్యాహ్న భోజన పథకము…పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. బాలబాలికల్ని ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో సామాజిక సమ భావన పెంపొందించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. అయితే ఏపీలో మాత్రం విద్యార్థులే మధ్యాహ్న భోజన వంటకాలు చేస్తున్నారు. కడప జిల్లా రాయచోటిలోని మాసాపేట జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థులే మధ్యాహ్న భోజన వంటకాలు చేస్తూ కనిపించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు తరగతి గదుల్లో ఉన్న పిల్లలను పిలిపించి, వారి చేతనే కోడి గుడ్లు తెప్పించడం, వాటిని ఉడకబెట్టడంతో పాటు, వంట కాలు తయారు చేసే క్రమంలో భాగంగా పప్పును రుబ్బుతూ కనిపించారు. వంట మనుషులు ఉన్నా కూడా విద్యార్థుల చేత ఇటువంటి పనులు చేయించడం ఏమిటని పలువురు విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. చదువు కోవాల్సిన విద్యార్థులు ఇలా వంట పనులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకా సోషల్ మీడియాలో అయితే చంద్రబాబు వంట మనుషులు ఎందుకు..వారికి జీతాలు ఎందుకు…వారి జీతాలు అమరవాతికి ఖర్చు చెద్దాం అని జీవో జారి చేసి ఉంటాడని నెటిజన్ల్ సెటెర్లు వేస్తున్నారు.
