‘జీఎస్టీ’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రాంగోపాల్ వర్మపై సీసీఎస్‌లో సామాజికవేత్త దేవి, ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఓ ఛానల్లో జరిగిన జీఎస్టీ వెబ్ మూవీ చర్చలో వర్మ తనను దూషించారంటూ దేవి ఫిర్యాదు చేశారు. జీఎస్టీ వ్యవహారం, ఓ మహిళను కించపరిచారన్న అభియోగాలపై వర్మను సైబర్ క్రైం పోలీసులు విచారిస్తున్నారు. వర్మ విచారణకు హాజరైన నేపథ్యంలో సీసీఎస్ పోలీసుస్టేషన్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సీసీఎస్ పోలీసులు విచారణకి హాజరయిన వర్మ ఫై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తుంది . ఆ ప్రశ్నలు ఇవేనంట
* ఐటీ యాక్ట్ ప్రకారం మహిళలను అశ్లీలంగా చూపించడం తప్పు. దీనికి మీ సమాధానం ఏమిటి?
* మీ ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లలో పెట్టిన పోర్న్ స్టార్ మియా మాల్కోవా ఫొటోలు ఎక్కడివి?
* ఓ టీవీ ఛానల్ చర్చలో విశాఖపట్నంకు చెందిన మహిళ మీద మీరు చేసిన కామెంట్లు అభ్యంతరకరం కాదా?
* దేవితో పోర్న్ సినిమా తీస్తాననడం ఎంత వరకు కరెక్ట్?
* ఈ సినిమాకు భారతీయ చట్టాలు వర్తించవు అని మీరు అంటున్నారు…. దీనికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి?
* సినిమాను అమెరికాలో తీశాను, అక్కడ నుంచే ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశామని చెబుతున్నారు. *సినిమాను ఎలా తీశారు? పెట్టుబడి ఎవరు పెట్టారు?
* విమియో వెబ్ సైట్ కు ఈ సినిమాను ఎంతకు అమ్మారు?
* సినిమాలో నటించిన మాల్కోవాకి డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు?
వంటి వరుస ప్రశ్నలతో వర్మని అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తుంది.
Tags case Devi Social Worker gst movie Police Station ramgopal verma