‘జీఎస్‌టీ’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రాంగోపాల్ వర్మపై ఓ ఛానల్‌లో జరిగిన జీఎస్‌టీ వెబ్ మూవీ చర్చలో వర్మ.. సామాజికవేత్త దేవిని దూషించారంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సీసీఎస్ పోలీసులు విచారణకి హాజరయిన వర్మకు సంబంధించిన కేసు సాధారణ కేసు కాదని ఆయనను విచారించిన సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ కేసును ఆషామాషీగా విచారించలేమని, టెక్నికల్ గా చాలా ఆధారాలను సేకరించాల్సి ఉందని ఆయన అన్నారు. ఒకవేళ వర్మ దోషిగా తేలితే, రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.గ కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఆధారాలను సేకరించిన తర్వాతే అరెస్ట్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.కేసును మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఆయనకు మరో నోటీసు ఇచ్చామని అన్నారు. విచారణను పూర్తి చేయడానికి సమయం పడుతుందని వివరించారు.