సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, ఆయన రాజకీయ పార్టీ గురించి కామెంట్ చేయడం చాలా తగ్గించేశాడు ..ట్విట్టర్ అనే ఆయుధంతో రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. వ్యక్తి ఎవరైనా.. మేటర్ ఏదైనా కానీ తనకు ఇష్టమొచ్చినట్టు కామెంట్లు విసిరేస్తుంటాడు. అయితే అందరిసంగతేమో కానీ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఏదో ఒక కామెంట్ విసరనిదే వర్మకు అస్సలు నిద్రపట్టడం లేదేమో వర్మ మళ్లీ మొదలు పెట్టారు. నిన్నరాత్రి వరుసగా మూడు ట్వీట్లతో పవన్ కళ్యాణ్ పైనా, జనసేన పార్టీ పైనా విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా జనసేన అన్ని స్థానాల నుంచి పోటీ చేయకపోతే, పవన్ కళ్యాణ్ పెద్ద తప్పు చేసినట్లే అని వర్మ అభిప్రాయపడ్డారు.
నోవాటెల్ లో ఘర్జించినపుడు సింహంలా కనపించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు మెలమెల్లగా చిరంజీవిలా కనిపిస్తున్నారంటూ కామెంట్ చేసారు. అలా ట్వీట్ చేసిన మరికాస్సేపటికే డైరక్ట్ ఆంధ్ర ప్రజలు మరీ ఆలస్యం కాకుండా మేలుకొని చిరంజీవిలా మారుతున్న పవన్ కళ్యాణ్ నిజరూపం గ్రహించాలని అపీల్ చేసారు. అంతే కాదు జనసేనను పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం కన్నా వరస్ట్ గా తయారుచేస్తున్నారని దారుణమైన కామెంట్ చేసారు. అంతేకాదు పవన్ రోజుకో విధంగా మారుతూ వస్తున్నారన్నది వాస్తవం. ముందుగా సంయుక్త పోరాట సమితి లేదా కార్యాచరణ కమిటీ అన్నారు. ఆ తరువాత ఎటువంటి వివరణ ఇవ్వకుండానే నిజనిర్థారణ కమిటీ అన్నారు. ఇలా రోజుకో రకంగా, బాబుగారికి అనుకూలంగా మాట్లాడుతుంటే, మారుతుంటే వర్మలాంటి వాళ్లకే కాదు సామన్య ప్రజలకు కూడ డౌట్ వస్తుంది కదా మరి.