జీఎస్టీ వెబ్ సిరీస్ కేసులో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను పోలీసులు విచారించారు. తన అడ్వకేట్తో పాటు విచారణనకు వచ్చిన వర్మను సైబర్ క్రైమ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇక విచారణలో భాగంగా జీఎస్టీని ఆన్ లైన్లో డైరెక్ట్ చేశానన్న వర్మ… ఫోటోల్లో వున్నాడని అడగ్గా… పోలాండ్లో వేరే సినిమా తీస్తున్నప్పుడు వెళ్లానన్నారు. సినిమా తీసిందంతా అమెరికన్ కంపెనీ అన్న వర్మ… తనకు ఏమీ పారితోషికం ఇవ్వలేదని.. జీఎస్టీని స్కైప్లో డైరెక్ట్ చేశానన్నారు. ఇక వర్మ లాప్ టాప్ సీజ్ చేసిన పోలీసులు… ఫోరెన్సిక్ పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చాక.. మళ్లీ విచారిస్తామని పోలీసులు తెలిపారు. విడియోకు తాను క్రియేటివ్ పర్పస్ మాత్రమే బాధ్యుడినని, తీసీందంతా అమెరికా సంస్థ అని, అయితే దాన్ని అమెరికా నుంచి అప్ లోడ్ చేశానని వర్మ అంటున్నాడు. అందువల్ల ఇక్కడి చట్టాలు వర్తించవని వర్మ వాదన. మరి ఈ కేసు ఎటు మళ్లుతుందో, ఎన్ని ఆసక్తికకర పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఏది ఏమైనా వర్మ మాత్రం చిక్కడు – దొరకడు అంటూ సోషల్ మీడియాలో ఆయన డై హార్ట్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
