వరుణ్ తేజ్, రాశీఖన్నాజంటగా నటించిన తొలి ప్రేమ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. మంచి వసూళ్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందించారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, రాశీఖన్నాల నటన చాలా బాగుందని, వరుణ్‌తేజ్ నాగబాబుకు మంచి గిఫ్ట్ ఇచ్చాడని ప్రశంసించాడు.
see also : జూనియర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్ ….
see also : చిక్కడు – దొరకడు.. వర్మ ఈసారైనా బుక్ అవుతాడా..?
ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ ఈ సినిమాను చూశారా..? అని ఓ విలేకరి వరుణ్‌తేజ్ ప్రశ్నించగా.. వెంటనే స్పందించిన చిరంజీవి, వాడు ఇంకా చూడలేదు. అంటూ మీడియా సమావేశాన్ని ముగించేశారు..? అయితే, పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు మీడియాతో మాట్లాడే అవకాశం ఎక్కడ వచ్చినా పవన్ గురించి డబ్బా కొట్టే చిరంజీవి.. మొన్న జరిగిన మీడియా సమావేశంలో పవన్ గురించి మీడియా ఎటువంటి ప్రశ్నలు అడుగుతారోనని, ముందు జాగ్రత్తతోనే చిరంజీవి వరుణ్‌తేజ్‌ను మాట్లాడనివ్వకుండా, చిరంజీవే మైక్ అందుకుని వెంటనే విలేకరుల సమావేశాన్ని ముగించేయడంతో మరోసారి మెగా బ్రదర్స్ మనస్పర్ధలు బయటపడ్డాయి.
see also : వైఎస్ జగన్ మరో సంచలనం..రాజ్యసభ అభ్యర్థిని ప్రకటన…!
ఇదిలా ఉండగా.. చిరంజీవిని మోసం చేసిన వారిలో పవన్ కల్యాణ్‌ది మొదటి ప్లేస్ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త సంచలనం హల్‌చల్ చేస్తోంది. పరకాల ప్రభాకర్ చిరంజీవిని మోసం చేశాడు సరే.. మరి నీవేమి చేసినట్లు అంటూ పవన్ కల్యాణ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ప్రజారాజ్యం పార్టీని ఎలాగైనా నడపాల్సింది పోయి.. నిస్సిగ్గుగా పార్టీ జెండాను పక్కన పెట్టేశాడు పవన్ కల్ఆల్యాణ్, అంతటితో ఆగక ఏకంగా చిరంజీవిని వదిలివెళ్లాడు పవన్ కల్యాణ్. మరి చిరంజీవి ఆ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిచి ఉంటే పవన్ కల్యాణ్ ఉండేవాడేమో మరి. సొంత తమ్ముడే ప్రజారాజ్యం పార్టీని, అన్న చిరంజీవిని వదిలేశాడు… మనమెంత.. అనుకున్నారో ఏమో ఇతర నేతలు కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి జారుకున్నారు. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తే చిరంజీవికి మొదటి ద్రోహం చేసింది పవన్ కల్యాణే కదా..!! అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.