ఉప్పల్ లోని చిన్నారి నరబలి కేసులో ఆశ్చర్యకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్య ఆరోగ్యం కోసం రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఆరేళ్ల పాపను నరబలి ఇవ్వడం నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు వారాల కిందట జరిగిన చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. రెండేళ్ల కిందటే నరబలికి బీజం పడింది. రెండేళ్ల కిందట మేడారం జాతరకు రాజశేఖర్, లత దంపతులు వెళ్లగా అక్కడ వారు ఓ కోయదొరను కలిశారు. ఆరోగ్యం బాగుపడాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే నరబలి ఇవ్వడమే మార్గమని ఆ కోయదొర, మాంత్రికుడు ఈ దంపతులకు చెప్పాడు. ఇక అప్పటినుంచీ నరబలి గురించి ఎంతో ఆలోచిస్తున్న రాజశేఖర్, శ్రీలతలు బలి ఇచ్చేందుకు పిల్లలు ఎక్కడ దొరుకుతారని తీవ్రంగా యత్నించి చివరకు బోయగూడలోని ఓ ఫుట్ పాత్ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడు.. తల నరికి..మూసీనదిలో మొండెంను పడేశారు..తరువాత క్షుద్రపూజలు చేస్తుండా తంతును తన ఫోన్‌లో రికార్డు చేశాడు. తర్వాత దాన్ని డీలిట్ చేయడం మరిచిపోయాడు. పోలీసులు రాజశేఖర్ ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. అందులో ఆడియో టేపులను పరిశీలిస్తుండగా వాటిలో ఒకటి వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అందులో మాటలను బట్టి విషయాన్ని అర్థం చేసుకున్నారు.
ఆడియోలోని మాటలను బట్టి రాజశేఖర్ భార్య శ్రీలతను చంద్రగ్రహణం రోజు కొందరు మంత్రగత్తేలు పూజలో కూర్చోబెట్టి తాయితులు కట్టిన చీపురుతో కొడుతున్నట్లు అర్థమైంది. ఆ క్రమంలో శ్రీలత చేసిన వీరంగం, ఆమె పలికిన మాటలు కూడా కేసును ఛేదించడానికి పనికి వచ్చాయి.
నేను లచ్చవ్వనురా, నురా అంటూ శ్రీలత వీరంగం వేసింది. ఆ ఆడియో ఆధారంగా పోలీసులు రాజశేఖర్‌ను విచారించారు. దాంతో చిన్నారిని బలి ఇచ్చింది తానే అని అంగీకరించాు. యూవీ టెక్నాలజీ ద్వారా. చిన్నారి రక్తం మరకలు కనిపించకుండా రాజశేఖర్ ఇల్లంతా శుభ్రం చేశాడు. అయితే, ఫోరెన్సిక్ నిపుణులు యూవీ టెక్నాలజీ ద్వారా ఇంట్లోని ప్రతి అంగుళాన్నీ పరిశీలించారు. ఒక చోట టైల్స్ మధ్యలోకంటికి కనిపించని స్థాయిలో ఉన్న రక్తం మరకను గుర్తించారు. చిన్నారి తనల నుంచి సేకరించిన రక్తనమూనాలతో డిఎన్ఎ పరీక్ష నిర్వహించారు. దాంతో రెండో ఒక్కటేనని తేలింది. క్షుద్రపూజలు చేసిన కోయ మంత్రగాళ్లను అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు.