తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,ఉద్యమనాయకుడు ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అయన ట్వీట్ చేశారు . సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మోదీ ఆకాంక్షించారు.కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ ,ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.
On his birthday, I convey my greetings to Telangana CM, KCR Garu. I pray for his wonderful health and long life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2018