వైసీపీ ఎమ్మెల్యే రోజా వారసత్వ రాజకీయాల పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన రోజా.. చిరంజీవి ఒక్కడే ఎంతో కష్టపడి వస్తే… ఫలాలు మాత్రం చాలా ఈజీగా మెగా వారసులు అనుభవిస్తున్నారని రోజా అన్నారు. ఆ రోజుల్లో హేమా హేమీ నటులతో పోటీపడి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. అయితే ఆయన తమ్ముళ్లు, కొడుకు, మేనల్లుళ్లు, అల్లుడు ఇలా మెగా కాంపౌండ్ మొత్తం చిరంజీవి చరిష్మాతో వచ్చేస్తున్నారని… ఒకవేల వీళ్లే కనుక చిరంజీవి కుటుంబ సభ్యులు కాకపోయింటే వారికి ఎవరైనా అవకాశాలు ఇస్తారా.. వాళ్లకు ప్రతిభ ఉందా… లేదా.. అనే విషయం తర్వాత తెలుస్తుంది. పరిచయం కావడమనేదే చాలా ముఖ్యమని రోజా అన్నారు. మరి రోజ ఈ వ్యాఖ్యలు చేసి చాలా రోజులే అయినా.. తాజాగా సోషల్ మీడియాలో ఈ వార్త మళ్లీ ట్రాల్ అవుతోంది.. మరి మెగా గ్యాంగ్ ఈ వార్త పై ఎలా స్పందిస్తారో చూడాలి.