ఆమె మహిళ..అంతకంటే ఆమె ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి అది కూడా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తీ.అలాంటి వ్యక్తి పబ్లిక్ లో సంచలనం సృష్టించారు.కేంద్ర మంత్రి అయిన మేనకా గాంధీ పబ్లిక్ మీట్ లో ప్రభుత్వ ఉద్యోగిని అందరి ముందే అసభ్యకరమైన పదజాలంతో దూషించారు.యూపీలో బహేరి లో పీడీఎస్ స్కీమ్ గురించి జరిగిన ఒక పబ్లిక్ సమావేశంలో ఉన్నత అధికారిపై వచ్చిన అవినీతి పిర్యాదుల అంశం మీద మంత్రి మేనకా గాంధీ స్పందించారు.ఆమె మాట్లాడుతూ పరుష పదజాలంతో తిట్టడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా అవాక్ అయ్యారు.అంతే కాకుండా ఒక అధికారి అని లెక్కచేయకుండా అందరి ముందు తిట్టడం..అవమానించడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తుంది.ఒక మంత్రి హోదా లో ఉండి ఇలా ప్రవర్తించడం భావ్యం కాదంటున్నారు రాజకీయ వర్గాలు..