Home / TELANGANA / కేసీఆర్ పాల‌న‌..బంగారు తెలంగాణ ఎలా రూపుదిద్దుకుంటుందంటే

కేసీఆర్ పాల‌న‌..బంగారు తెలంగాణ ఎలా రూపుదిద్దుకుంటుందంటే

నాయకులు మార్గదర్శకులు కావాలని జనం ఆశిస్తారు. నాయకులు తమకంటే తెలివి కలవారై  ఉండాలని జనం కోరుకుంటారు. తెలంగాణ విజయం సాధించింది అక్కడే. స్వరాష్ట్ర నినాదానికి దేశం మొత్తం ఆమోదాన్ని సాధించడం అంటే అది భావజాల విజయమే. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రాష్ర్టాన్ని సాధించి ప్రజామోదంతో పాలన పగ్గాలు చేపట్టిందీ ఈ భావజాలానికి నాయకుడుగానే. తెలుసుకునే సాధన ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నిరంతరం శోధించేవారు, తెలుసుకునేవారు మిగిలినవారి కంటే ఉన్నతంగా ఉంటారు.

ఎత్తిన జెండా దించకుండా పోరాడిన కేసీఆర్‌కు ప్రజలు వరమాల వేశారు.తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగు మాసాల్లోనే మన ప్రభుత్వానికి, మంది ప్రభుత్వానికి తేడా ఏమిటో చూపించగలిగింది. నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో అద్భుతాలు జరుగవు. కానీ కేసీఆర్ కొన్ని అద్భుతాలు చేసి చూపించారు. కరెంటు కోత అనేమాట వినిపించకుండా చేశారు. ఎంత కష్టమైనా నష్టమైనా ఇచ్చే విద్యుత్ నాణ్యం గా, ఒక పద్ధతి ప్రకారం సరఫరా అయ్యేట్టు చూడాలని టెక్నోక్రాట్స్ అయిన మన విద్యుత్ అధికారులకు చెప్పారు. తెలంగాణ వచ్చినంతనే విద్యుత్ ఉత్పత్తి పెరగలేదు. కేవలం నాయకుడి చిత్తశుద్ధి, మన అధికారుల అంకితభావం కారణంగానే ఇది సాధ్యమైంది. విద్యుత్ సర్‌ప్లస్ రాష్ట్రమని చెప్పుకుంటున్న ఆంధ్రాలో ఇప్పటికీ విద్యుత్ కోత లు ఉన్నట్టు అనంతపురం, విశాఖపట్నం జిల్లాల మిత్రులు ఇటీవల కలిసినప్పుడు చెప్పారు.

కొత్త విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభం, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఆధునీకరణ, ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. మన రాష్ట్రం మనదైంది కాబట్టి మన కష్టం మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాము. ఇంతమాత్రానే తెలంగాణ కష్టాలన్నీ తొలగిపోయాయని చెప్పడం లేదు. సంక్షేమ పింఛన్లపై సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఖర్చు చేసిన దానికంటే నాలుగు రెట్లు నిధులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సమైక్యాంధ్ర ప్రభుత్వం పెండింగులో పెట్టిపోయిన ఫీజు ల బకాయిలనూ తెలంగాణ ప్రభుత్వమే చెల్లించింది. అడిగిన వారికి అడగని వారికి అందరికీ అన్నీ ఇస్తున్నారు. చెప్పినవి, చెప్పనివీ అన్నీ ముఖ్యమంత్రి చేసుకుంటూ పోతున్నారు. చేయాల్సినవి ఇంకా చాలా ఉన్న మాట వాస్తవమే. అయినా అరవయ్యేళ్లుగా జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి సమయం పడుతుంది. కానీ ఓపిక లేనివారు త‌మ విమ‌ర్శ‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉంటారు..రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉంటారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat