తెలంగాణ నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, వరంగ ల్ నుంచి వాషింగ్టన్ దాకా విస్తరింపజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనను ఇంటింటి నినాదంగా మార్చారు. ఎవరెన్ని చెప్పినా, తిట్టినా తెలంగాణవాదానికి ఇప్పటికీ చోదకుడు కేసీఆర్ ఒక్కరే. తెలంగాణవాదాన్ని కేసీఆర్ ఎన్నడూ లెట్ డౌన్ చేయలేదు. మొదట చంద్రబాబు, ఆ తర్వాత రాజశేఖర్‌డ్డి, మళ్లీ చంద్రబాబు వంటివారు ఎన్నిసార్లు ఎన్ని ఎదురుదెబ్బలు, దొంగదెబ్బలు కొట్టినా ఆయన తెలంగాణ జెండాను మాత్రం కింద పడేయలేదు. స్వరాష్టాన్ని సాధించి చూపించారు.
తెలంగాణ విషయంలో కేసీఆర్‌ను టార్గెట్ చేసిన తీరు కూఆ ఆశ్చర్యకరంగా ఉందని పలువురు విశ్లేషకులు చెప్తుంటారు. కేసీఆర్ రాజకీయంగా బలపడేకొద్దీ తెలంగాణవాదం బలపడుతుంది. తెలంగాణవాదాన్ని కొట్టాలంటే కేసీఆర్‌ను కొట్టాలి. కేసీఆర్‌ను రాజకీయంగా బలహీనపర్చితే తెలంగాణవాదం బలహీనపడుతుంది. అందుకే తెలంగాణ వ్యతిరేకులకూ (సమైక్యవాదులకు), తెలంగాణ ద్రోహులకూ, తెలంగాణ రావడం కంటే రాజకీయంగా బతకడం ముఖ్యమని భావించే కొందరు తెలంగాణ మిత్రులకూ(?) ఉమ్మడి లక్ష్యం అయ్యారు కేసీఆర్. కేసీఆర్‌ను రాజకీయంగా ఫినిష్ చేస్తే తెలంగాణ కథ ముగిసిపోతుందని వారి ఆలోచన. కానీ కేసీఆర్ సక్సెస్ అయింది అక్కడే. ఆయన వందలాది మంది కేసీఆర్‌లను తయారు చేసి పల్లెపప్లూకూ వదిలారు. తెలంగాణ వ్యతిరేకులు, ద్రోహుల పాచికలు పారకుండా నిలువరించగలిగారు.
`తెలంగాణ ప్రజలు ఇప్పటికే చాలాసార్లు ఆ విషయం రుజువు చేశారు. తెలంగాణవాదం ఇవ్వాళ ఈ ప్రాంత ప్రజల జీవనాడుల్లో ఇంకిపోయింది. తెలంగాణ తెచ్చిన వాళ్లను, ఇచ్చిన వాళ్లను మాత్రమే తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. గోడమీది పిల్లులను, ఊసర గబ్బిలాలను ఇక్కడి ప్రజలు ఇంకేమాత్రం భరించే అవకాశం లేదు’ అని వివరిస్తుంటారు.