తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ రోజు సీ ఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని..తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల మధ్య పల్లిపట్టు నందు కేక్ కట్ చేసి.. తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆయన పేరుతో పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. “ఉద్యమనేత తెలుగువాడి సత్తాను ఢిల్లీ గద్దెకి తెలిపి.. ఢిల్లీ వారు దిగి వచ్చే వరకు పోరాటం సాగించి 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కల అయిన ప్రత్యేక రాష్ట్ర సాధనను సాధించిన తెలంగాణ వీరుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినంను తమిళనాడులో నివసించే తెలుగు వారు జరపడం ఒక బాధ్యత. ఎందుకంటే ఆయన ఉద్యమస్ఫూర్తి, తమిళనాడులో తెలుగును సాధించుటకు నిరంతర పోరాటం చేస్తున్న మా అందరికీ ఆయన ఆదర్శం. ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి అన్న నందమూరి తారక రామారావు తరువాత తెలుగు వాడికి, తెలుగు భాషకు ఆయన ఇచ్చిన ప్రాతినిధ్యం మరవలేనిది.
అందుకే తెలుగు భాషను అభిమానించే మా అందరి బాధ్యతగా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించటం జరిగింది. దీనివలన తెలుగువారు ఏ రాష్ట్రాలలో నివసిస్తున్నా.. అంతే ఒకటే అనే నినాదంను ప్రజల్లో తీసుకురావడం, ఇతర రాష్ట్రాలలో ఉన్న మా అందరి కర్తవ్యం. గ్రామీణ ప్రాంతంలో ఒక మారుమూల పల్లె అయిన పల్లిపట్టులో కేసీఆర్ పుట్టినరోజు జరపడం తెలుగువారి ప్రేమకు నిదర్శనం..‘‘ అని తెలిపారు