తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.రాష్ట్రంలో టీఆర్ఎస్ శ్రేణులు ,కేసీఆర్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్వీ యూత్ వింగ్ అధ్యక్షుడు అయిన శంభీపూర్ రాజు ,ఎమ్మెల్యే వివేకనందగౌడ్ ,స్థానిక యువత అంతా కల్సి రూపొందించిన సాంగ్ ను ఎంపీ కవిత విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం ఆయన ఆలోచనలో నుండే వచ్చింది.
వీటిన్నిటిని ఒక పద్ధతిలో వివరిస్తూ అత్యంత అద్భుతంగా పాటను చిత్రీకరించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా వచ్చే అన్ని కానుకల్లో అన్నిటికంటే ఇదే అత్యుత్తమం గిఫ్ట్ అని ఆమె అన్నారు ..