తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం నేడు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు,కేసీఆర్ అభిమానులు రక్తదానాలు,అన్నదానాలు లాంటి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.
పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణంలో ఖాదర్ అనే వ్యక్తీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు.అంతే కాకుండా ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు.
అనాధాశ్రమంలో మహాన్నధానం చేశాడు.పేదవారికి చీరలు పంపిణి చేశారు.ఈ క్రమంలో ఖాదర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ ..రాష్ట్రంలో మాత్రం అధికార పార్టీ నేతలు ఏమి చేయలేకపోతున్నారు.కేసీఆర్ స్పూర్తితో ఆంధ్ర ప్రాంత నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ..