ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ప్రగతి భవన్ మైదానం మొత్తం పండుగ వాతావరణం ఏర్పడింది.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ రోజు ప్రగతి భవన్ లో విఘ్నేష్ అనే బాలుడు కలిశాడు.
గత కొన్ని రోజులుగా వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన విఘ్నేష్… జన్యుసంబంధమైన వ్యాధితో గత మూడేళ్లుగా ఇంటికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ను టీవీలో చూస్తూనే అభిమానం పెంచుకున్నాడు. దీంతో తాను ‘కేసీఆర్ తాత’ను చూడాలనుకుంటున్నట్టు ఇటీవల తన తల్లిదండ్రులకు చెప్పడంపై మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పుట్టిన రోజున ఆ బాలుడి కోరిక ప్రకారం ప్రగతి భవన్‌కు పిలిపించి.. అతనిని ఆప్యాయంగా పలకరించారు.ఆ కుటుంబ యోగ క్షేమాలను అడిగితెలుసుకున్నారు. అంతేకాకుండా బాలుడి వైద్య ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.నేనున్నా.. అని భరోసా కల్పించారు.