ప్రముఖ తమిళ స్టార్ హీరో ,టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న హీరో సూర్య వైఫ్ ,ఒకప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ అయిన జ్యోతికపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.తమిళ నాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో మక్కళ్ కట్చి నేతలు పోలీస్ కమీషనర్ కార్యాలయంలో పిర్యాదు చేశారు.అసలు ముచ్చాటకు వస్తే ప్రముఖ దర్శకుడు బాలా తీసిన నాచియార్ సినిమాలో జ్యోతిక ప్రముఖ పాత్రలో నటించింది.ఈ మూవీలో వచ్చే కొన్ని సంభాషణలపై ఆది నుండి పెను వివాదం చెలరేగుతున్న సంగతి తెల్సిందే.దీంతో ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాల్లోని మాటలను బీఫ్ చేస్తూ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది.ఈ మూవీలో మాకు ఆలయాలైన చెత్తకుప్పలైన ఒక్కటే అని డైలాగ్ పై హిందు మక్కళ్ కట్చి నేతలు మండిపడ్డారు.దీంతో హిందు మనోభావాలను దెబ్బతీశారంటూ హీరోయిన్ జ్యోతికపై కేసు నమోదు చేశారు.
