ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపురంలో 1200 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ అక్కడ ఒక మొక్కను నాటారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు అభినందనలు తెలిపారు. అంతకుముందు లింగసముద్రం మండలం కొత్తపేట గ్రామంలోకి అడుగుపెట్టడం ద్వారా ప్రకాశం జిల్లాలోకి ఆయన ప్రవేశించారు. జగన్ కు ఎదురేగి ప్రకాశం జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే గత 20 రోజులు నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. 9 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా సాగిన పాదయాత్రలో జగన్ 266.5 కిలోమీటర్లు నడిచారు.
