ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం కొత్తపేట వద్ద జిల్లాలో పాదయాత్ర మొదలైంది. ఈ సందర్భంగా పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అయితే గురువారం వైఎస్ జగన్ తో దిగిన సెల్ఫీని గుండెల్లో దాచుకుంటామని విద్యార్థులు పేర్కొన్నారు. కొండాపురం మండలం ఆదిమూర్తిపురం వద్ద వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు మంచాల ప్రవీణ్, శ్రీనివాసులు, కిరణ్, వల్లూరు వినోద్, పర్రి చరణ్ కలిశారు. తమ వెంట తెచ్చుకున్న ట్యాబ్‌తో జననేత వైస్ జగన్‌తో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి వారిని ఆప్యాయంగా పలకరించి, బాగా చదువుకోవాలని పేర్కొన్నారు.
